Seethakka Inspects Geo Tube Works
ఆకేరు న్యూస్, ములుగు:
ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నది కరకట్ట భద్రత కోసం నూతన సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న జియో ట్యూబ్స్ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, కరకట్ట భద్రత, వరదల సమయంలో నది కరకట్ట దెబ్బతినకుండా చేపడుతున్న రక్షణ చర్యలను పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులను అడిగి మ్యాప్ ఆధారంగా గోదావరి నది ప్రవాహ తీరు, కరకట్ట పరిస్థితులు, జియో ట్యూబ్స్ ఏర్పాటు విధానం, చేపడుతున్న రక్షణ చర్యలపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి సీతక్క దిశ నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
