* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ‘పింక్ పవర్ రన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన అనంతరం పక్షి అకృతిలో అతిపెద్ద మానవహారంగా ఏర్పడిన వలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలువురు వైద్యులు, సుధా రెడ్డి ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
