MLA Kadiyam Srihari Raghavapur Fire Victims
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవాపూర్ లో శనివారం జరిగిన అగ్ని ప్రమాద బాధితులను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం పరామర్శించి, భరోసా కల్పించారు. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పిల్లల విద్యా సర్టిఫికెట్లు, బట్టలు, నిత్యవసరాలు, నగదు పూర్తిగా కాలిపోయాయని బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో స్పందించిన కడియం శ్రీహరి బాధిత కుటుంబాన్ని ఓదార్చి, అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ. 20 వేల ఆర్థిక సాయంతో పాటు, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 50 సిమెంట్ బస్తాలు వెంటనే ఇప్పిస్తానని, ప్రభుత్వ ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
* “కమ్యూనిటీ భవనం పూర్తి చేస్తాను”
గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఎస్సీ (మాల) కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 15 రోజుల్లో నిధులు మంజూరు చేయిస్తానని, 3 నెలల్లో నిర్మాణం పూర్తి చేసే విధంగా నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలూకుంట్ల శిరీష్ రెడ్డి, గంగుల మహేశ్వర్ రెడ్డి, కుక్కల రాజు, రేగుల రవి, స్థానిక సర్పంచ్ మెరుగు క్రాంతి, నాయకులు నాగరబోయిన శ్రీరాములు, హనుమంతు, దశరథం, సాంబమూర్తి, నర్సింగం, రాజు, సత్తయ్య, ఎల్ల స్వామి, క్రాంతి కుమార్ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
* “50 కిలోల బియ్యం”
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అంగుళం మహేశ్వర్ రెడ్డి, రాగుల రవిలు బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించారు.
* “5 వేల ఆర్థిక సహాయం”
మీదికొండ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాగరబోయిన శ్రీరాములు బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
