బిఆర్ స్ మ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి
* నా విజయం తథ్యం
* రాకేష్ రెడ్డి ధీమా
ఆకేరు న్యూస్ హన్మకొండ : నేను ప్రజా సేవ చేయడానికే విదేశాల్లో ఉద్యోగం మానేసి భారత దేశానికి వచ్చానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అన్నారు . పోలింగ్ అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు . రాజకీయాల్లోకి రావడానికి అస్సలు కారణం కాకతీయ యూనివర్సిటీయే .. కాకతీయ యూనివర్సిటీ జై తెలంగాణ నినాదం తో నన్ను ముందుకు నడిపించిందన్నారు .
ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. ఈరోజున ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు, సేవ దృక్పధం.. స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటేనే గెలుస్తామని బిఆర్ స్ మ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు. అహకారం, బెదిరింపులు బ్లాక్ మెయిల్ చేసే వారికి రాజకీయాల్లో తావులేదన్నారు . ఇప్పటివరకు ఎవరిమీది బురదజల్లే ప్రయత్నాలు చేయలేదన్నారు ..కొందరు మాత్రం రాజకీయ సానుభూతి కోసం నామీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు . పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా బిఆర్ స్ పార్టీ ని పెద్ద ఎత్తున్న ప్రజలే మద్దతు తెలుపుతున్నారన్నారు..విజయం నావైపే ఉందని రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
———————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
