ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి 20న ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్ రెడ్డి, మల్లేశం ఎగ్గే, మీర్జా రియాజుల్ హాసన్ ఎఫెందీ.. ఏపీలో కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరచూరి అశోక్ బాబు, బి. తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీకాలం మార్చి 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. 11వ తేదీన స్క్రుటినీ .. మార్చి 13వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఉంటుంది. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ చేపడతారు. మార్చి 24వ తేదీలోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
