Mulugu Children Burn Accident
* రూ. 1,43,421 రూపాయలు ఆర్ధిక సహాయం.
* దాతల సహాయం మరువలేనిది : అబ్బు సతీష్
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లాలో కన్నాయి గూడెం మండలం బుట్టాయి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి రమేష్ ఇద్దరు పిల్లలు (కూతురు, కొడుకు) మూడు రోజుల క్రితం ఆడుకుంటూ
చెత్త కుప్ప మంటలో పడిపోయి 60 శాతం కాలిపోయారు.
ప్రస్తుతం హన్మకొండ లోని వేద హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. వైద్యానికి 3 లక్షల రూపాయలు ఖర్చులు అవుతాయని డాక్టర్స్ చెప్పారు. రమేష్ కుటుంబం చాలా నిరుపేద కుటుంబము కావడంతో ముప్పనపల్లి సహాయ నిధి దాతలు సహాయం చేసి మా పిల్లలను కాపాడాలని రమేష్ కోరారు.
దీనిపై సహాయ నిధి ధాతల అందించిన సహాయంతో మంగళవారం హన్మకొండ లోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిల్లలను పరామర్శించి 1,43,421 రూపాయలు తండ్రి రమేష్ కు అబ్బు సతీష్ ఆధ్వర్యంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో సహాయ నిధి సభ్యులు వనం ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి రాంబాబు , గ్రామస్తులు దుర్గం ప్రభాకర్, కంచ రమేష్, తిప్పనపల్లి విజయ్, బోనాముక్కుల కాటన్ రెడ్డి, ఎండీ ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
