Seva Pakhwada
Seva Pakhwada| ఆకేరు న్యూస్, ములుగు: మండలకేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం మేర యువ భారత్ – ములుగు సహకారంతో స్థానిక యువతరం యూత్ అధ్యక్షుడు గుళ్ళు సుమన్ ఆద్వర్యంలో సేవ పఖ్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రైమరి హెల్త్ సెంటర్ ప్రాంగణంలో చెత్తను తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన తాడ్వాయి సర్పంచ్ ప్రవళిక–గున్ను మాట్లాడుతూ, యువతతో పాటు ప్రతి పౌరుడు తమ ఇల్లు, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
సర్పంచ్ తో పాటు, వార్డ్ సభ్యులు సుమన్, యూత్ సభ్యులు ప్రైమరి హెల్త్ సెంటర్ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో నవయుగ యూత్ అధ్యక్షుడు సందీప్ , ప్రధాన కార్యదర్శి పోలుదసరి రంజిత్ కుమార్, ప్రథం సంస్థ జిల్లా కోఆర్డినేటర్ బండారి అనిల్ కుమార్, యూత్ సభ్యులు *కళ్ళేబోయిన హరీష్, బండి రాము, బండి లక్ష్మణ్, పాల రాకేష్, , యాట ప్రవీణ్, తుమ్మల మల్లేష్, దుబ్బాక శ్రీనివాస్, పిన్నీటి శివరెడ్డి, పోలుదదారి రవి కిషోర్, సాత్విక్ చారి, సుశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
