Godavari Youths Drowning Incident
ఆకేరు న్యూస్,ములుగు:
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గ్రామ ముగ్గురు యువకులు ఆదివారం గోదావరిలో సరదాగా ఈతకు వెళ్లారు .ముగ్గురు యువకుల్లో సంపత్ అనే యువకుడు సురక్షితంగా ఒడ్డుకు చేరి, అస్వస్థతకు గురయ్యారు.స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు .నరేశ్, పండు అనే ఇద్దరు యువకుల ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో. గజ ఈతగాళ్లు పోలీసులు గోదావరిలో ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం ఎట్టకేలకు ఇద్దరు యువకుల మృతదేహా లు లభ్యమయ్యాయి. దీంతో నవ యువకులు ఇద్దరు మృతి చెందడంతో ఆయా కుటుంబాల రోదనలు మింన్నంటాయి.
ఈ ఘటనపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలు నదులు, వాగులు వంటి ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు.
