డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
* పవన్ ఫ్యాన్స్ లో గూస్ బంప్స్
* హోరెత్తిన సభాప్రాంగణం
* స్టేజీపై అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం
* అన్నదమ్ముల చేయి లేపి అభివాదం చేయించిన ప్రధాని
ఆకేరు న్యూస్, విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకారంలో అందరి దృష్టీ పవన్‌కల్యాణ్ పైనే ఉంది. ముఖ్యంగా జనసైనికులు, అభిమానులు పవన్ ప్రమాణ స్వీకారం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. పవన్ పదేళ్ల కష్టం.. నిరీక్షణకు ఫలించే క్షణాలు కావడంతో ఉత్కంఠ ఏర్పడింది. ఆ మాట వినడం కోసం, చూడడంతో ఎంతో మంది కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ ఘట్టం మొదలవ్వగానే.. పవన్ అభిమానుల్లో గూస్ బంప్స్ మొదలయ్యాయి. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అని ఆయన అనగానే.. సభా ప్రాంగణం హోరెత్తింది. పవన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని సతీమణి లెజినోవా రాయల్ వీడియో తీస్తుండడం ఆకట్టుకుంది. తమ్ముడు మంత్రిగా ప్రమాణం చేస్తుంటే.. అన్న చిరంజీవి ఆసక్తిగా తిలకించారు. ప్రమాణ స్వీకారం అనంతరం.. మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ కల్యాణ్. వేదికపై ఉన్న ప్రముఖులు అందరికీ నమస్కరిస్తూ వెళ్లిన పవన్.. అన్న చిరంజీవికి పాదాభివందనం చేశారు. తమ్ముడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన చిరంజీవి మురిసిపోయారు.
అన్నదమ్ములతో ప్రధాని
ఈ వేడుకలో మరో అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. కార్యక్రమం ముగిసిన అనంతరం వెళ్తున్న ప్రధానికి అన్న చిరంజీవిని కలవాలని కోరుతూ.. అన్నట్లుగా ఆయన చెవిలో పవన్ చెప్పగా, మోదీ పదా వెళ్దాం అన్నారు. అనంతరం చిరంజీవి వద్దకు వెళ్లిన మోదీ.. ఆత్మీయంగా పలకరించారు. అన్నదమ్ములతో ముచ్చటించారు. ఇద్దరి చేతులను పైకి లేపి సభికులకు అభివాదం చేయించారు. ఈ వేడుకలో ఈ దృశ్యం అత్యంత ఆకర్షణీయంగా మారింది.
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
