Students Drug Awareness
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సిఐ జి.వేణు సూచించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని గురుకుల పాఠశాలను తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వసతి గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉపాధ్యాయులు చెప్పిన బాటలో పయనించి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదవాలన్నారు. కుటుంబ పరిస్థితులు, సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని చదువుకోవాలన్నారు. సిగరెట్టు, గాంజా, మద్యం బారిన పడకుండా ఆన్లైన్ గేమింగ్ ల జోలికి వెళ్లకుండా కష్టపడి చదివి పేరు ప్రతిష్టలతో పాటు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది ఉన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
