Padi Kaushik Reddy
* పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, హుజురాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా, ప్రజలకు ఉపయోగపడే కొత్త అభివృద్ధి పనులు చేపట్టాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన సీఎం.. కేసీఆర్ హయాంలో నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టరేట్ నిర్మాణంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, వాటిని తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ అమలు చేయాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. సిరిసిల్లలో సీఎం నిర్వహించే సమావేశానికి ఇతర జిల్లాల నుంచి జనాన్ని తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కరీంనగర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని, హుజురాబాద్‌లో రెండో విడత దళిత బంధు నిధులతో పాటు రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరారు. కల్వల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు వీణవంక మండలంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
