* 4,089 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపు
ఆకేరున్యూస్, ఢిల్లీ: న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పర్వేశ్ వర్మ 4,089 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆప్ అధినేత, మాజీ సిఎం అరవింద్ కేజీవ్రాల్ను ఓడిరచారు. కాగా.. గెలుపు అనంతరం ఆయన ఓ ట్వీట్ చేశారు. హిందీలో ‘జైశ్రీరామ్‘ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా సంచలనం కావడంతో ఆయన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పోటీదారుగా చెబుతున్నారు. ప్రవేశ్ వర్మ 1977 నవంబర్ 7న ఢిల్లీలో జన్మించారు. ఆయన బిజెపి సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. అతని తల్లి పేరు రాంప్యారి వర్మ. ప్రవేశ్ వర్మ స్వాతి సింగ్ను వివాహం చేసుకున్నారు. ప్రవేశ్ వర్మ తన ప్రాథమిక విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూలలో పూర్తి చేశారు. దీని తరువాత అతను కిరోరి మాల్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. అంతర్జాతీయ వ్యాపారంలో ఎంబీఏ పూర్తి చేశారు.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
