Rapaka Prashanth Seva Award
ఆకేరు న్యూస్, రాయపర్తి :
సామాజిక సేవా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని కాట్రపల్లి గ్రామానికి చెందిన రాపాక ప్రశాంత్ ను ప్రతిష్టాత్మక ‘సేవా సంకీర్ణం’ అవార్డు వరించింది. వింగ్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాలోజీ నారాయణరావు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన మారక ద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలన అవగాహన సదస్సులో ఆయనకు ఈ అవార్డును ఘనంగా ప్రధానం చేశారు.
రాపాక ప్రశాంత్ సమాజ హితం కోసం, నిరుపేదల సంక్షేమం కోసం అందిస్తున్న నిరంతర సామాజిక సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేసినట్లు వింగ్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ పాషా ( రాష్ట్ర అధ్యక్షులు) సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రాపాక ప్రశాంత్ మాట్లాడుతూ… తాను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
