BRS Leaders Join Congress
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన సుమారు 25 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రేస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గన్నేగోని రమేష్, కనక రాజు, గణేష్, రమేష్ బాబు, బైరగోని జంపయ్య, రాజు హరికృష్ణ, ఆంబోతు యాకు, శ్రీరాముల సమ్మయ్య, ఈర్ల సమ్మయ్య, సాంబరాజు, గూడూరి కొమురయ్య, కుమ్మరి రాజు, కుంట బాలరాజు, ఎండి యాకుబ్, ఎండి అక్బర్, ఎండి చాంద్ బాష, గడిపి యాదగిరి, ఎడ్ల పోశయ్య, నల్ల లింగయ్య, యాదయ్య, కన్నీబోయిన రవి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని వర్గాల ప్రజలు ఆకర్షతులు అవుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకం పేద ప్రజలకు ఉపయోగపడుతుందని అనడానికి కాంగ్రెస్ పార్టీలోకి జరుగుతున్న చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, రాజవరం గ్రామ కాంగ్రెస్ నాయకులు , ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
