India Chase 388 Runs
* డకెట్ విధ్వంసం..
* సిరీస్ గెలవాలంటే టీమిండియా చరిత్ర సృష్టించాల్సిందే
ఆకేరు న్యూస్, డెస్క్:
లార్డ్స్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ బెన్ డకెట్ (141) అద్భుత శతకంతో చెలరేగగా, యువ బ్యాటర్ జేకబ్ బెథెల్ (91) సెంచరీకి చేరువలో ఆగిపోయాడు. వీరిద్దరి భారీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది.
* డకెట్-బెథెల్ భారీ భాగస్వామ్యం
మొదటి వికెట్‌కు డకెట్, బెథెల్ కలిసి 192 పరుగులు జోడించి భారత్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. అనంతరం జో రూట్ (74 నాటౌట్) మరో కీలక ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో జోస్ బట్లర్ (41 నాటౌట్) కేవలం 13 బంతుల్లోనే మెరుపులు మెరిపించి స్కోరును 387కు చేర్చాడు.
* బౌలర్లు పూర్తిగా తేలిపోయారు
భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మాత్రమే రెండు వికెట్లు తీశాడు. గుర్నూర్ బ్రార్ (97), ప్రిన్స్ యాదవ్ (79), అర్ష్‌దీప్ సింగ్ (72) భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ఇంగ్లండ్‌కు భారీ స్కోరు నమోదు చేయడం సులభమైంది.
* భారత్ ముందు కఠిన సవాల్
మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్ విజేతే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. లార్డ్స్‌లో 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియాకు పెద్ద సవాలే అయినప్పటికీ, బ్యాటింగ్ లైనప్‌పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
