
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక అనంతరం చేతులు కలిపిన మోదీ, రాహుల్.
ఆకేరు న్యూస్ డెస్క్ : లోక్‌సభ లో స్పీకర్ ఎన్నిక అనంతరం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్పీకర్‌గా ఓం బిర్లా (Om Birla) గెలుపు ప్రకటించిన అనంతరం ఆయనను స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర (Narendra Modi) మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓం బిర్లా ఎంపీ సీటు వద్దకు వెళ్లారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఆహ్వానించారు. అనంతరం మోదీ, రాహుల్ ఒకరికొకరు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అధికార, విపక్ష సభ్యులందరూ ఆదృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. అనంతరం స్పీకర్ కుర్చీ దగ్గరికి ఓంబిర్లాను తీసుకెళ్లారు. తొలుత స్పీకర్‌కు శుభాకాంక్షలు చెప్పిన మోదీ.. అనంతరం వెనుకే ఉన్న రాహుల్‌ను ముందుకు వెళ్లాల్సిందిగా సూచించారు. ఆ సందర్భంలో మోదీ, రాహుల్ నమస్కరించుకున్నారు.
————–