Captain Smit Machchar
* ఫోన్లో పరామర్శించిన ప్రధాని మోదీ
అకేరు న్యూస్, డెస్క్ :అబుదాబిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పైలట్ స్మిత్ మచ్చర్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై మోదీ వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్మిత్ మచ్చర్.. కో-పైలట్ తనపై ఎలా దాడి చేశాడనే విషయాలను ప్రధాని మోదీకి వివరించినట్లు సమాచారం. ఘటన సమయంలో ఎదురైన పరిస్థితులు, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా ఆయన ప్రధానితో మాట్లాడారు.
అదే సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో తనకు ధైర్యాన్ని ఇచ్చిన అంశాలను కూడా స్మిత్ మచ్చర్ ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఆయన ధైర్యసాహసాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన ఫోన్ సంభాషణ తనకు మరింత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందని స్మిత్ మచ్చర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
