* అనర్హత పిటిషన్పై రేపు విచారణ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై కడియంపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ నిమిత్తం ఆయన స్పీకర్ ముందు హాజరుకానున్నారు. కడియం శ్రీహరి బీఆర్ ఎస్ నుంచి కారు సింబల్ పై గెలిచి కాంగ్రెస్ లోనికి ఫిరాయించారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆయనపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11కు జరగబోయే విచారణకు రావాలని వివేకాకు కూడా స్పీకర్ నోటీసులు అందజేశారు. కడియం, వివేకానంద్ వాదనలను స్పీకర్ విననున్నారు. కాగా, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు పిటిషన్లు రాగా స్పీకర్ ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్ విచారణ దశలోనే ఉంది. నేడు కడియం శ్రీహరి వివాదం తేలనుంది.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
