Yoga Day Konduru School
ఆకేరు న్యూస్ రాయపర్తి:- మండలంలోని కొండూరు గ్రామ జడ్పిహెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉపాధ్యా యులు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21 తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారు జూన్ 21 ప్రత్యేకత ఏమిటంటే ఉత్తరార్ధగోళంలో అన్నింటికంటే సుదీర్ఘమైన రోజు (సమ్మర్ సోల్ స్కిట్ ) భూమిపై సూర్యుని శక్తి ఎక్కువగా ఉండే ఈ రోజుకు హత్యధికంగా ఆరోగ్యపరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే ఈ తేదీని ఎంచుకున్నారని . యోగా అనే పదం సంస్కృత మూలం యుజ్ నుండి వచ్చింది దీని అర్థం కలయిక లేదా ఏకం చేయడం శరీరం మనస్సు మరియు ఆత్మలను ఏకం చేయడమే యోగ ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు
ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ( ఫిజికల్ డైరెక్టర్) నాగరాజు మరియు ఉపాధ్యాయులు వి. వి. ఆర్. ఆచార్య విద్యార్థులకు వివిధ రకాలైన ఆసనాలు,ప్రాణాయామాలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తూ నేర్పించారు. నిత్య జీవితంలో యోగా, సూర్య నమస్కారాలు చేయడం వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను, ఏకాగ్రతను పెంచుకోవడంలో యోగా యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరంగా వివరించారు.
* ఆకట్టుకున్న నృత్య రూపక ప్రదర్శన:
ఈ వేడుకల్లో విద్యార్థులు యోగా ఆసనాలను ఒక అద్భుతమైన నృత్య రూపకంలో (Yoga Dance) ప్రదర్శించి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి . లయబద్ధంగా వారు వేసిన ఆసనాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణ, రఘు, స్వామి, శ్యాంసుందర్, శివ కృష్ణ తదితర ఉపాధ్యాయ సిబ్బందితో పాటు విద్యార్థులందరూ పాల్గొన్నారు .
Please tell us what is wrong. Your report will be sent to the website team.
