Sircilla Panipuri Incident KTR
ఆకేరు న్యూస్, సిరిసిల్ల : మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్లో పానీపూరీ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై వైద్యులు, అధికారులు, స్థానిక నాయకులకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ నగర్లో తోపుడు బండిపై విక్రయిస్తున్న పానీపూరి తిని 12 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవాళ్లు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 12 మంది చిన్నారులు నిన్న రాత్రే సిరిసిల్ల ఆసుపత్రిలో చేరగా, ఈరోజు ఉదయం మరో ఏడుగురు పెద్దవారు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మొత్తం 19 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే, వీరికి ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని, అందరూ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు కేటీఆర్కు వివరించారు.
బాధితులంతా క్షేమంగా ఉన్నారన్న విషయం తనకు ఎంతో రిలీఫ్ ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
