Ranabali
* అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్..
* రిలీజ్ డేట్‌తో పోస్టర్ విడుదల
Ranabali| విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
విజయదశమి సందర్భంగా అక్టోబర్ 16న ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. సినిమా విడుదల వాయిదా పడుతుందనే ప్రచారానికి చెక్ పెడుతూ మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌తో కూడిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో తన మాతృభూమి, ప్రజలను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేసిన యోధుడు రణబాలిగా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు. వీరతిలకం పెట్టుకున్న విజయ్ లుక్ ఆకట్టుకునేలా ఉండటంతో పోస్టర్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఇటీవల విడుదలైన ‘ఏందయ్య సామీ..’ ఫుల్ లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన లభించింది. ఈ పాటలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే సినిమా ట్రైలర్‌తో పాటు మిగతా లిరికల్ సాంగ్స్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
19వ శతాబ్దం నేపథ్యంలో, 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ తెరకెక్కుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక బృందం: నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్; కథ, దర్శకత్వం రాహుల్ సంకృత్యన్; కో-ప్రొడ్యూసర్స్ అనురాగ్ పర్వతనేని, శివ్ చనన; సంగీతం అజయ్–అతుల్; డీవోపీ నీరవ్ షా, జిష్ణు భట్టాచర్జీ; రచన ప్రమోద్ తమ్మినేని; ప్రొడక్షన్ డిజైన్ శివం రావు నాగసాని; ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఆర్. ఇతర విభాగాల్లో ఆర్. చంద్రశేఖర్, చెంబోలు సాయి ఆదిత్య, కృతి మహేశ్, అర్చన రావు, విఠల్ కోసనం, సునీల్ రాజు చింత, యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు, రఘునాథ్ కెమిశెట్టి తదితరులు పనిచేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
