Sigma
* చిరంజీవి
Sigma| ఆకేరు న్యూస్, సినిమా: హీరో సందీప్ కిషన్ నటించిన యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. జేసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘సిగ్మా’ ట్రైలర్ చాలా ఎంటర్టైనింగ్గా, హుషారుగా ఉందని అన్నారు. సందీప్ కిషన్ సినిమాలు వెరైటీగా ఉంటాయని, అతడిని చూస్తుంటే తన యంగ్ డేస్ గుర్తుకొస్తాయని చెప్పారు.
జేసన్ సంజయ్ దర్శకత్వంలోకి రావడం తనకు సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు. సంజయ్ తాతగారు, తండ్రి నుంచి దర్శకత్వం, రచనపై ఆసక్తి వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. తన తాతగారిలాగే సంజయ్ కూడా దర్శకత్వంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నానని అన్నారు. అక్టోబర్ 2న విడుదల కానున్న ‘సిగ్మా’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. తన తరం, తర్వాతి తరానికి చిరంజీవి గురువులాంటి వారని, ఆయన తమకు ఎంతో స్ఫూర్తి అని చెప్పారు. తన కెరీర్లో తొలిసారి తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘సిగ్మా’లో ఫన్, యాక్షన్, కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని తెలిపారు.
దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. ‘సిగ్మా’లో యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్, ట్రెజర్ హంట్ వంటి కొత్త అంశాలు ఉన్నాయని చెప్పారు. తనను నమ్మి అవకాశం ఇచ్చిన సందీప్ కిషన్, నిర్మాతలు, చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తమ సినిమా కోసం సమయం కేటాయించి ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. ‘సిగ్మా’ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని తెలిపారు. సంజయ్‌లో మంచి క్లారిటీ ఉందని, ఈ చిత్రానికి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించానని చెప్పారు. చిరంజీవితో పూర్తి స్థాయి సినిమా చేయాలన్న తన కోరిక ‘కాకా’తో నెరవేరబోతోందన్నారు.
హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ.. చిరంజీవి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని చెప్పారు. ‘సిగ్మా’ యాక్షన్-అడ్వెంచర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని, కుటుంబంతో కలిసి ప్రేక్షకులు సినిమా చూడవచ్చన్నారు.మకాగా, ఈ వేడుకలో నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ‘సిగ్మా’ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
