Vicky Kaushal
* ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న బాలీవుడ్ హీరో
* పాత్రపై పెరిగిన ఆసక్తి
Vicky Kaushal| ఆకేరు న్యూస్, డెస్క్: బాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘లవ్ & వార్’ ఒకటి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
ఇంటెన్స్‌గా విక్కీ
ఫస్ట్ లుక్‌లో విక్కీ కౌశల్ సీరియస్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్తో కనిపిస్తున్నారు. ఆయన పాత్రలోని భావోద్వేగం, యాక్షన్ కోణాలను ప్రతిబింబించేలా ఈ లుక్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో అభిమానుల నుంచి స్పందన వస్తోంది.
భారీ అంచనాలు
భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ కలిసి నటిస్తుండటంతో ‘లవ్ & వార్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విక్కీ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
