Amala Paul
* రీఎంట్రీపై ఆసక్తి
Amala Paul: ఆకేరు న్యూస్, సినిమా: నటి అమలా పాల్ తాజాగా చేసిన ఫొటోషూట్‌తో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పీచ్ రంగు రిబ్డ్ ట్యాంక్ టాప్, వైట్ షార్ట్స్, స్ట్రైప్డ్ సాక్స్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆమె.. సూర్యకాంతి, నీడల మధ్య ఇచ్చిన పోజులతో ఆకట్టుకున్నారు. చెక్క బ్యాక్‌డ్రాప్‌పై సాగిన ఈ ఫొటోషూట్ ఆర్టిస్టిక్ లుక్‌తో ప్రత్యేకంగా నిలిచింది.
రెండేళ్లుగా సినిమాలకు దూరం
అమలా పాల్ వెండితెరపై కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. సినిమాలకు విరామం ఇచ్చినప్పటికీ.. తాజా ఫొటోషూట్‌లో ఆమె గ్లామర్, స్టైల్ ఏమాత్రం తగ్గలేదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
రీఎంట్రీపై ఆసక్తి
అమలా పాల్ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఆమె తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆమె ఎలాంటి కథతో, ఏ హీరో సరసన వెండితెరపైకి తిరిగి వస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
