Kalyana Lakshmi Scheme Telangana
* తులం బంగారం హామీని కూడా అమలు చేయాలి.
ఆకేరు న్యూస్, ములుగు: కల్యాణలక్ష్మి పథకాన్ని వెంటనే పునరుద్ధరించి, అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండలంలో సర్పంచ్ ప్రవళిక గున్ను రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రహదారిపై ర్యాలీ,ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ఇటీవల కోర్టు స్టే కారణంగా కల్యాణలక్ష్మి పథకం అమలు నిలిచిపోయిందని, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించి, పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడంతో పాటు కల్యాణలక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం అందించే హామీని వెంటనే అమలు చేసి, అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కార్యాలయంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఆలేటి ఇంద్రసేన రెడ్డి, వార్డుమెంబెర్స్, అలెం ప్రతిమ, ఈసం సాంబయ్య,పార్టీ సీనియర్ నాయకులు యాదిరెడ్డి, బంగారి శ్రీరాములు, పాయం నర్సింఘరావు, పోగు నాగేష్, కోట సురేష్, గంట మనోజ్ రెడ్డి, మనుగొండ నవీన్, గట్టు వంశీ, మల్కామ్ సాంబయ్య ఠాగూర్ సురేందర్, నితిన్, మంతెన నాగారాజు, చింతల కుమారయ్య, చింతల మల్లయ్య, రాజక్క, ఎల్లబోయిన రాకేష్,సూదిగొండ శివాజీ, పాండవులు చింటూ, చిన్ను, సందీప్, సతీష్,బన్నీ, లక్ష్మణ్, కారపతి అజయ్,తదితరులతో పాటు సుమారు వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
