CM Revanth Reddy and Harish Rao
Telangana Assembly| ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నాలు, ఆందోళనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
హరీష్ రావు హయాంలోనే రూల్స్
గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని రూల్స్ కమిటీ అసెంబ్లీ నిబంధనలను రూపొందించిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, నినాదాలతో కూడిన టీషర్టులను అసెంబ్లీ ప్రాంగణంలోకి తీసుకురావద్దని అప్పుడే నిబంధనలు రూపొందించారని తెలిపారు. ఇప్పుడు అదే నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడం సరికాదన్నారు.
స్పీకర్ వ్యవస్థను గౌరవించాలి
గేట్-3 వద్ద జరిగిన ఘటనలపై సీఎం స్పందిస్తూ.. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఆదేశాల మేరకే భద్రతా సిబ్బంది విధులు నిర్వహించారని చెప్పారు. ఇందులో రాజకీయ కక్షసాధింపు లేదని స్పష్టం చేశారు.
స్పీకర్ పదవి పార్టీలకు అతీతమైనదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయాలు, సభా వ్యవస్థను ప్రతి సభ్యుడు గౌరవించాలని సూచించారు. నిరసనలతో అసెంబ్లీ సమయాన్ని వృథా చేయకుండా ప్రజా సమస్యలపై చర్చించాలని, నిబంధనలకు లోబడి ఏ అంశంపైనైనా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
