CM Revanth Reddy
CM Revanth Reddy: ఆకేరు న్యూస్, హైదరాబాద్: మహిళల భద్రత, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా సిబ్బంది, మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహిళలను కించపరిచేలా లేదా దాడులకు పాల్పడేలా ఎవరైనా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఆడబిడ్డ భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, స్వయం సహాయక సంఘాల బలోపేతం, వడ్డీ లేని రుణాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం వంటి చర్యలను వివరించారు.
కోటి మంది మహిళలను ‘కోటీశ్వరులు’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
