Revanth Reddy RTC power supply meeting
*విద్యుత్ సరఫరా , ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పై నేడు సమీక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు అత్యంత బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. రాష్ట్ర సచివాలయం వేదికగా రెండు కీలక రంగాలపై ఆయన దృష్టి సారించారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు, మరోవైపు వేసవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడంపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా పాలనను పరుగులు పెట్టించే క్రమంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
*వరుస భేటీలు…
హైదరాబాద్‌లోని సచివాలయంలో నేడు సాయంత్రం 4:30 గంటల నుండి రాత్రి వరకు సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహించనున్నారు. తొలుత ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో పవర్ సప్లై పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు.
*ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు…
పరిష్కార మార్గాలపై ఫోకస్ చేస్తూ సాయంత్రం 4:30 గంటలకు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీఎం జరుపుతున్న ముఖ్యమైన సమావేశం ఇది. కార్మికుల వేతన సవరణ (PRC), పెండింగ్ అరియర్స్, మరియు సంస్థలో సిబ్బంది కొరతపై చర్చించనున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల పెరిగిన రద్దీని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్త బస్సుల కొనుగోలుపై కార్మిక నేతల సూచనలను సీఎం తీసుకోనున్నారు.విద్యుత్ శాఖపై సమీక్ష…
*సాయంత్రం 6:30 గంటలకు
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. ఈ క్రమంలో విద్యుత్ కోతలు లేకుండా చూడటంపై సీఎం సమీక్షించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు మరియు సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. వ్యవసాయానికి 24 గంటల సరఫరాలో అంతరాయం కలగకుండా, గృహ అవసరాలకు కరెంట్ కోతలు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించే అవకాశం ఉంది.
ఈ వరుస సమీక్షా సమావేశాల ద్వారా అటు కార్మిక వర్గానికి భరోసా ఇవ్వడంతో పాటు, ఇటు రాష్ట్ర ప్రజలకు వేసవిలో నిరంతర విద్యుత్ అందుతుందనే నమ్మకాన్ని కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
