Odisha Bank Skeleton Incident
* ఎందుకలా జరిగిందంటే..?
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : అస్థి పంజరంతో ఏకంగా బ్యాంకుకు వెళ్లాడు ఆ వ్యక్తి .. అదేంటి బ్యాంకు కు వెళ్ళాల్సింది అస్థిపంజరంతో ఎలా వెళ్ళడం ఏంటి అన్న సందేహం అందరికీ వస్తుంది కదా.. వ్యవస్థలు సామాన్యులకు అవస్థలు సృష్టించినప్పుడు బ్యాంకులకు అస్థిపంజరాలే వెళతాయని సామాజిక వేత్తలు అంటున్నారు.
ఈ సంఘటన ఒడిశాలోని కేంజర్ జిల్లాలో జరిగింది. మల్లిపోషి బ్రాంచ్లో జరిగింది. జీతూ ముండా అనే యాభై ఏళ్ళ వ్యక్తి తన అక్క పేరుతో బ్యాంకు అకౌంట్లో డబ్బులను డ్రా చేసుకునేందుకు వెళ్ళాడు. అలా డ్రా చేయడానికి కుదరదు .. ఆమె భర్త , పిల్లలు ఎవరైనా ఉంటే వారిని తీసుకురమ్మని బ్యాంకు అధికారులు చెప్పారు. అక్కతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ఇప్పుడు జీవించి లేరని వివరించారు. అయితే మీ అక్క చనిపోయినట్లు సాక్ష్యం కావాలని అడిగారు. చనిపోయినట్లు సర్టిఫికెట్ కావాలంటే మాలాంటి వాళ్ళకు ఎవరు ఇస్తారని జీతూ చెబుతున్నాడు. అక్క చనిపోయిందని ఎన్ని సార్లు చెప్పినా బ్యాంకు అధికారులు వినిపించుకోలేదంటున్నారు.
* భుజం మీద అక్క అస్థిపంజరం
అక్క కలరా భర్త , పిల్లలు చనిపోవడంతో తన తల్లిగారి ఊరైనా దియానాలి కి వచ్చి కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించేది.. కొంత కాలం ముందు కలరా తన ఆవును అమ్మి బ్యాంకులో రూ. 19000 బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకుందామని బ్యాంకు కు వెళితే ఆమె రావాలని చెప్పారు. చనిపోయిందని చెబితే సాక్ష్యం కావాలంటే .. చేసేది లేక మూడు నెలల క్రితం ఖననం చేసిన అక్క సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని తీసుకుని బ్యాంకు వచ్చానని మీడియాతో జీతూ ముండా చెప్పారు..అస్థి పంజరంతో బ్యాంకులోకి రావడంతో ఒక్కసారిగా కస్టమర్లు, ఉద్యోగులు భయ భ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకుని పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. కాగా చనిపోయిన మహిళకు జీతూ తో పాటు ఒక సోదరుడు, సోదరి ఉన్నందున ఒక్కరికి డబ్బులు ఇవ్వడం కుదరదని మాత్రమే చెప్పాని బ్యాంకు మేనేజర్ అధికారులకు వివరించారు. కలరా ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేసి ఆ తర్వాత డబ్బులు జీతూ తో పాటు మిగిలిన ఇద్దరు సమానంగా పంచుకోవాలని అధికారులు చెప్పారు.
—————————————–
