
* రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన కేంద్రం
ఆకేరు న్యూస్ డెస్క్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం(Central Government) ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు సేవా పతకాలు(Police Medals) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 942 మంది ఉంటే.. ఇందులో 746 మందికి పోలీస్ విశిష్ట సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 95 మందికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకాలను ప్రకటించింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్(Hyderabad) లా అండ్ ఆర్డర్ అదనను సీపీ విక్రమ్ సింగ్(VikramSing)కు ప్రెసిడెంట్ మెడల్ ప్రకటించింది.
ఆయనతో పాటు ఎస్పీ మాణిక్ రాజ్(SP Manikraj)కు కూడా రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. అలాగే, మరో 12 మందికి విశిష్ట సేవా పతకాలు ప్రకటించింది. వారిలో ఐజీ కార్తికేయ, ఎస్పీలు ముత్యంరెడ్డి, రామ్ కుమార్, ఫజ్లుర్, డీఎస్పీలు వెంకటరమణ, వేణుగోపాల్, ఏఎస్ఐ లు రణవీర్ సింగ్, ఠాకూర్, జోసెఫ్, మొయినుల్లాఖాన్, సీఐ నిరంజన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు పాత్యనాయక్, ఆయూబ్ ఉన్ఆనరు. అంతేకాకుండా, ముగ్గురు అగ్నిమాపక శాఖ అధికారులు, నలుగురు హోంగార్డులకు పతకాలు ప్రకటించింది. ఇక ఏపీ నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కడాలి అర్జున రావు, వార్డర్ ఉండ్రాజవరపు వీరవెంకట సత్యనారాయణకు కరెక్షనల్ సర్వీస్ విభాగంలో పోలీస్ విశిష్ట సేవా పతాలకు ఎంపికయ్యారు.
………………………………..