* హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలుపై సీఎం రేవంత్ (Cm Revanth)ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శనివారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి తెలంగాణలో నాలుగు పథకాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ సమీక్ష కీలకంగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పథకాలను లాంఛనంగా సీఎం ప్రారంభించనున్నారు. మంత్రులు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uthamkumar reddy), తుమ్మల నాగేశ్వరరావు(thummala Nageswarrao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasareddy) సమీక్షకు హాజరయ్యారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంపై సీఎం రేవంత్ ను మంత్రులు అభినందించారు. సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు కూడా సమీక్షలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలు పారదర్శకంగా జరగాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతీ పేదవానికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
