సూరత్‌లో ఆరు అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఏడుగురి మృతి
* గుజరాత్లో భవనం కూలిన ఘటనలో…
ఆకేరు న్యూస్ డెస్క్ : గుజరాత్ సూరత్‌లో ఆరు అంతస్తుల భవనం కూలిన (Building Collapse) ఘటనలో మృతుల సంఖ్య ఏడుగురికి చేరింది. ఇంకా పది మందికిపైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురు భవనం శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2017లో నిర్మించిన అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. బిల్డింగ్‌లో 30 ప్లాట్లు ఉండగా ప్రస్తుతం అందులో ఐదు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత కొన్నిరోజులుగా అక్కడ కురుస్తోన్న భారీ వర్షాల కారణంగానే బిల్డింగ్ నానడంతో ఒక్కసారిగా కుప్పకూలినట్లు పోలీసులు స్పష్టం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ ప్రొక్లైన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు.
————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
