నటుడు రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్
* నేను ముసలిదానిని అయినా ఆయనతోనే..
* మాల్వీ-రాజ్ మైండ్ గేమ్ ఆడుతున్నారు
* మాకు గుడిలో పెళ్లయింది : లావణ్య
* హీరో వివాదంలో మరో మలుపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజ్ తరుణ్‌కు (Raj Tarun), తనకు గుడిలో పెళ్లి అయిందని, అతడు లేక తాను బతకలేనని లావణ్య (Lavanya) పేర్కొన్నారు. తాను ముసలిదానిని అయినా అతడే తనకు కనిపిస్తాడని అంటున్నారు. ఆమె మీడియా ముందుకు మరోసారి వచ్చి కీలక విషయాలు వెల్లడించారు. తన తల్లిదండ్రులను ఎదిరించి మరీ రాజ్‌ను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. రాజ్, తానూ 11 ఏళ్లుగా కలిసే ఉంటున్నామన్నారు. 5 నెలలుగా గొడవలు ఉన్నాయన్నారు. లవర్ సినిమాతో మాల్వీ ఎంటర్ అయిన తర్వాతే గొడవలు మొదలయ్యాయని వెల్లడించారు. రాజ్ తనను వదిలించుకోవాలని సూచిస్తున్నారని ఆరోపించారు. మాల్వీ – రాజ్ తరుణ్ కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. మాల్వీ చంపుతానన్న బెదిరింపులతో పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. మాల్వీ చాలా కాన్ఫిడెంట్ గా అబద్దాలు చెబుతోందన్నారు. రాజ్ తొలుత తనకు డబ్బులు ఇవ్వడం ఆపేశాడని, తర్వాత తన గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టాడని అన్నారు. 2014 నుంచి అద్దె ఇంట్లో ఉన్న తాము 2022 జనవరిలో సొంతింట్లోకి షిప్ట్ అయ్యామన్నారు. అతడు హీరో కాక ముందు నుంచి, వైజాగ్‌లో ఉన్నప్పటి నుంచే తమకు పరిచయం అని లావణ్య వివరించారు.
————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
