SRR Foundation| ఆకేరు న్యూస్, రాయపర్తి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, బొడ్డెమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని మహిళలకు SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో DJ సౌండ్ సిస్టమ్ అందజేశారు.
మైలారం గ్రామంలోని 1వ వార్డుకు చెందిన మహిళలు బతుకమ్మ, బొడ్డెమ్మ వేడుకల సందర్భంగా ఆటపాటలు, కోలాటాలు నిర్వహించేందుకు సౌండ్ సిస్టమ్ అవసరమని SRR ఫౌండేషన్ చైర్మన్, BRS జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన సౌండ్ సిస్టమ్ అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో మహిళలకు ఉచితంగా DJ సౌండ్ సిస్టమ్‌ను అందజేశారు. దీంతో తమ కోరికను వెంటనే నెరవేర్చినందుకు మైలారం 1వ వార్డు మహిళలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
సేవా కార్యక్రమాలు
SRR ఫౌండేషన్ ద్వారా పేదలు, నిరుద్యోగులు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వివిధ రకాలుగా సహాయం అందిస్తున్నట్లు BRS నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, వార్డు సభ్యులు పరిపాటి రవీందర్ రెడ్డి, గాడిపెల్లి సునీత రాములు, బెల్లి అనూష ఎల్లయ్య, మండల పార్టీ నాయకులు సంధి దేవేందర్ రెడ్డి, గుడెల్లి వెంకటయ్య, గబ్బేట యాకయ్య, పెరటి యాదవ రెడ్డి, సురేందర్ రెడ్డి, పసునూరి శ్రీనివాస్, సంకినేని ఎల్లస్వామి, కోలా సంపత్, బాధ సుధాకర్, చెన్నంగి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
