Kishan Reddy Village Grant
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగాం జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామానికి రూ. 10 లక్షలు మంజూరు చేసిన సందర్భంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి వర్యులు జి.కిషన్ రెడ్డి చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు.
గ్రామ సర్పంచ్ ఇల్లందుల తిరుపతమ్మ ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల క్రితం గ్రామాన్ని దత్తత తీసున్న కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గ్రామంలో పలు రకాల అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
చిన్నపెండ్యాల-పెద్ద పెండ్యాల మధ్య వాగు పై బ్రిడ్జి నిర్మాణంకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా బిజెపి చిల్పూర్ మండల అధ్యక్షులు గంటె ఉపేందర్ ఆధ్వర్యంలో బిజెపి జనగాం జిల్లా అధ్యక్షులు సౌడా రమేష్ పాల్గొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి, వరంగల్ పార్లమెంట్ కొకన్వీనర్ ఇనుగాలా యూగేందర్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ కాదుగాయ రమేష్, జిల్లా నాయకులు తోకల సంపత్ రెడ్డి, బాల్నే శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సతీష్, అమరేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, నాయకులు జోగులు, ఊరటి రాజు, కట్ల అనిల్, మారబోయిన రమేష్, ఆకుల సాయి కుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
