paddy procurement centers farmers Telangana
- చైర్మన్లు శ్రీధర్ రావు, లావణ్య సూచన
ఆకేరు న్యూస్ స్టేషన్ ఘన్పూర్
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని చిల్పూరు గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి అన్నారు. సోమవారం జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని లింగంపల్లి, వెంకటాద్రి పేటలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం చైర్మన్ శ్రీధర్ రావు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరిధాన్యం దిగుబడి అవుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐకెపి సెంటర్లతో మహిళలకు ఉపాధి, రైతులకు సరైన మద్దతుధర లభిస్తుందని తెలిపారు. సన్నధాన్యం క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని అన్నారు. తరుగు, తాలు లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీద సురేష్ కుమార్ సర్పంచులు ఏ. నరసింహారెడ్డి, ఏ. మల్లారెడ్డి, దేవి మంజుల తిరుపతిరెడ్డి ఆ గ్రామాల నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
