Mohammed Asma, Basara IIIT Selection
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మహమ్మద్ అస్మా బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. మహమ్మద్ అన్వర్-అనిష ఫాతిమా కూతురు మహమ్మద్ అస్మా గత ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో 548 మార్కులు సాధించి బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపికయింది.
బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపికైన మహమ్మద్ అస్మాను సోమవారం పాఠశాలలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడవల్లి లావణ్య మల్లారెడ్డి, ఉపసర్పంచ్ పశుల వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు కుమార్, శ్రీరంజనిదేవి, అరుణదేవి, వార్డ్ సభ్యులు హరీష్, శిరీష, భోగం షర్మిల గ్రామస్తులు తదితరులు పాలుగొన్నారు.

* పుస్తకాలు పంపిణీ..
మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పుస్తకాలను సోమవారం స్థానిక ఉప సర్పంచ్ పశుల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
