Bhurla Latha Co Option Member
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ కో ఆప్షన్ మెంబర్ గా ఎన్నికైన భుర్ల లత శంకర్ ర్లను ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆదివారం ఘన సన్మానం చేసింది.
ఈ సందర్భంగా కో ఆప్షన్ సభ్యురాలు భుర్ల లత శంకర్ మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసన సభ్యులు కడియం శ్రీహరి ఆశీస్సులతో ప్రజా సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, అలాగే నా ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తాననీ అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గోరంట్ల యాదగిరి, ఉపాధ్యక్షులు పిట్టల అనిల్, ప్రచార కార్యదర్హి నీల శివలింగం, సభ్యులు దారం నాగరాజ్, భుర్ల తిరుపతి, పిట్టల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
