NEET Paper Leak Criticism
* విద్యార్థుల భవితవ్యాన్ని కేంద్రం ప్రమాదంలోకి నెట్టింది
.. జఫర్గడ్ మాజీ జెడ్పిటిసి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
నీట్ పరీక్ష నిర్వహణలో విఫలమై కేంద్ర ప్రభుత్వం, NTA (National Testing Agency ) కలిసి లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారని జఫర్గడ్ మాజీ జెడ్పిటిసి, డిసిసి జనరల్ సెక్రెటరీ ఇల్లందుల బేబి శ్రీనివాస్ ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో నీట్ పేపర్ లీక్, ఎంట్రన్స్ పరీక్ష వాయిదాపై మంగళవారం ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా, సుమారు 22 లక్షల మంది విద్యార్థులు NEET పరీక్ష రాయనుండగా, మన రాష్ట్రం నుండి దాదాపు 70 వేల మంది విద్యార్థులు పరీక్షకు సిద్ధం అయ్యారన్నారు. గతంలో కూడా NEET పరీక్ష పేపర్ లీక్ అయినప్పటికీ, ఈసారి అయినా పకడ్బందీగా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్ష నిర్వహిస్తారని అందరూ ఆశించారు.
కానీ ఏ మాత్రం,బాధ్యత లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే NMC నిబంధనలను సడలిస్తూ, వైద్య ప్రమాణాలను, పాటించకుండా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇష్టానుసారంగా, అనుమతులు ఇస్తూ, వైద్య విద్యను ప్రమాదంలో పెట్టడమే కాకుండా, ప్రజల ప్రాణాలను కూడా ప్రమాదంలో పెడుతున్నారని ఆరోపించారు.
ఇప్పటికే అధికారికంగా NEET పేపర్ లీకేజ్ జరిగిన విషయం నిర్ధారణ కావడం, 180 ప్రశ్నల్లో, బయాలజీ నుండి 90 ప్రశ్నలు, ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి 40 ప్రశ్నలు లీక్ అయ్యాయని, వార్త ఛానల్ లో ప్రచురితం అవడం, దేశ విద్యా వ్యవస్థకు మాయని మచ్చ అన్నారు. నీట్ పరీక్షను నిర్వహించే NTA కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తోంది కాబట్టి, ఈ ఘటనపై పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ఆశలు, వారి భవిష్యత్తుతో,ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడo అత్యంత దారుణం, శిక్షించరాని నేరం అన్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ జెడ్పిటిసి, డిసిసి ప్రధాన కార్యదర్శి బేబీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
