Lord Uday Kumar Nagraj
* ‘లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజు’ కు ఘన పౌర సన్మానం
ఆకేరు న్యూస్, హన్మకొండ: బ్రిటన్ పార్లమెంటులో ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ సభ్యుడిగా నియమితులై అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన తెలంగాణ ముద్దుబిడ్డ లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజు కి నేడు ఘన పౌర సన్మానం జరగనుంది. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
* కార్యక్రమ వివరాలు…
తేదీ: ఆగస్టు 11, 2026 (ఈరోజు)
సమయం: సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: నిత్య బ్యాంకెట్ హాల్, రాంనగర్, హన్మకొండ
* వరంగల్ – కరీంనగర్లతో ప్రత్యేక అనుబంధం…
కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన శ్రీ లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజు గారు వరంగల్లో జన్మించారు. ఈయన శ్రీ నాగరాజు హన్మంతరావు – శ్రీమతి నిర్మలాదేవి దంపతుల కుమారుడు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీ వద్దిరాజు వెంకటేశ్వరరావు గారి అల్లుడిగా వరంగల్ ప్రాంతంతో ఆయనకు సుదీర్ఘమైన, ప్రత్యేకానుబంధం ఉంది.
* విద్యాభ్యాస ప్రస్థానం:
ఉదయ్ కుమార్ నాగరాజు ప్రాథమిక విద్యాభ్యాసం హన్మకొండలోని నక్కలగుట్టలో సాగింది. అనంతరం హైదరాబాద్, ఢిల్లీలలో చదువు పూర్తిచేసి, రాంటెక్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. అనంతరం లండన్లోని ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను, అలాగే ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL) లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో రెండవ మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తిచేశారు.
* రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సరికొత్త చరిత్ర
కేవలం 47 సంవత్సరాల పిన్న వయస్సులోనే బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ అయిన ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’కు నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజు సరికొత్త చరిత్ర సృష్టించారు. తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ స్థాయి రాజకీయ రంగానికి ఎదిగిన ఆయన విజయం తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎంతో గర్వకారణం.
* పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపు
మన ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని తెలంగాణ వికాస సమితి నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఘన పౌర సన్మాన కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, మేధావులు, విద్యావేత్తలు మరియు తెలంగాణ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ వికాస సమితి విజ్ఞప్తి చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
