*నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు – డీజీపీ శివధర్ రెడ్డి
ఆకేరు న్యూస్, డేస్క్:రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల సరళిపై ఆయన కీలక ప్రకటనలు చేశారు. నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు మినహా, మిగిలిన చోట్ల పోలింగ్ సజావుగా జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎవరైనా ప్రచారానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిని వెంటనే పోలీస్ స్టేషన్కు తరలిస్తామని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదని, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
