Telangana Weather Update
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే సమయంలో ఒకవైపు ఎండలు, మరోవైపు భారీ వర్షాలతో ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.
* ఒకే రాష్ట్రం.. భిన్న వాతావరణం….
ప్రస్తుతం ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, దీనికి భిన్నంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
* రానున్న మూడు రోజుల ముందస్తు హెచ్చరిక…
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎండల తీవ్రత ఉన్నప్పటికీ, అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై ఉపశమనం లభించనుంది.
* జూన్ 18 నుంచి అసలు సిసలైన వానలు…
ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత మరింత పెరగనుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన..
రాజధాని హైదరాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న పరిసర జిల్లాల్లో జూన్ 18 నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నగర ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
