* ఫిబ్రవరి 11న పోలింగ్!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 28 నుంచి జనవరి 30 వరకు నామినేషన్ల స్వీకరణ. జనవరి 31వ తేదీన నామినేషన్ల పరిశీలన.నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.ఫిబ్రవరి 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ జరుగుతుంది.రీ-పోలింగ్ ఎక్కడైనా అవసరమైతే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు.ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు.
మేయర్, ఛైర్మన్ ఎన్నిక ఎప్పుడంటే?
ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులు, కౌన్సిలర్ల ద్వారా మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అలాగే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు.ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక… ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ పరోక్ష ఎన్నిక ప్రక్రియను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.పట్టణ ప్రాంతాల్లో స్థానిక నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
