* 7 గురు మృతి, 12 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ..
ఆకేరు న్యూస్, డెస్క్:అమెరికాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మిడ్-అట్లాంటిక్ మరియు దక్షిణ రాష్ట్రాలపై మంచు కోరలు చాచడంతో గడ్డకట్టే చలి నెలకొంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. పరిస్థితు తీవ్రతను గమనించిన అధ్యక్షుడు ట్రంప్, ప్రభావితమైన 12 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ని ప్రకటించారు.దాదాపు 19 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం వింటర్ వెదర్ వార్నింగ్‌లో ఉన్నారు. సుమారు 10 లక్షల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క రోజులోనే 17 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. రహదారులు మంచుతో నిండిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది..
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
