* కాంగ్రెస్ తరఫున ఒకరు.. బీజేపీ తరఫున మరొకరు ప్రచారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) మళ్లీ ఢిల్లీకి పయనం అయ్యారు. ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో హస్తినకు బయలుదేరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections) డిసెంబర్ 5వ తేదీన జరగనున్నాయి. అందుకే డిసెంబర్ 3సాయంత్రం వరకు ప్రచారానికి సమయం ఉంది. దీంతో చివరి రోజు కాంగ్రెస్(Congress) పార్టీ తరఫున ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), బీజేపీ (BJP) మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ నామమాత్రంగానే ఉన్నట్లు సమీకరణాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎంతో కొంత ప్రభావం చూపించాలని కాంగ్రెస్ తరపున ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా ఢిల్లీలో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడంతో బాబు బీజేపీకి అండగా నిలుస్తున్నారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
