* మహబూబ్నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
* భయాందోళనకు గురైన ప్రజలు
ఆకేరున్యూస్, మహబూబ్నగర్: తెలంగాణను మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మూడు రోజుల కిందట కూడా తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంనపలు సంచలనం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఏడు సెకండ్ల దాకా భూ ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
