* సోషల్ మీడియాలో వైరల్!
ఆకేరు న్యూస్,ఖమ్మం:సాధారణంగా పెళ్లి పత్రికలు అంటే పసుపు కుంకుమలు, దేవుళ్ల బొమ్మలు, బంగారు రంగు డిజైన్లతో నిండి ఉంటాయి. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక యువకుడు తన వృత్తిపై ఉన్న మక్కువతో పెళ్లి పత్రికను అత్యంత వినూత్నంగా రూపొందించాడు. తాను చేస్తున్న వృత్తికి అద్దం పట్టేలా రూపొందించి అందరినీ ఆకట్టుకున్నాడు. మెడికల్ రంగంపై మక్కువతో..జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన కిన్నెర నవీన్ ఎంబీఏ పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఖమ్మం జిల్లాకు చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది. శిరీష కూడా ఎం.ఫార్మసీ పూర్తి చేసి ఫార్మసిస్ట్‌గా రాణిస్తోంది. వధూవరులిద్దరూ మెడికల్ రంగానికి చెందిన వారు కావడంతో, తమ వివాహ ఆహ్వాన పత్రిక తమ వృత్తిని ప్రతిబింబించేలా ఉండాలని నిర్ణయించుకున్నారు.నవీన్ తన ఆలోచనలకు పదును పెట్టి, పెళ్లి పత్రికను ఒక టాబ్లెట్ స్ట్రిప్ (Tablet Strip) ఆకారంలో డిజైన్ చేయించాడు. ఇందులో కేవలం రూపమే కాదు, వాడిన పదజాలం కూడా మెడికల్ స్టైల్లోనే ఉండటం విశేషం.సాధారణంగా మందుల ప్యాకెట్లపై ఉండే హెచ్చరికల స్థానంలో.. “Warning: Dear Friends Please Don’t Miss My Wedding” అంటూ సరదాగా రాసి బంధుమిత్రులను ఆహ్వానించారు.పెళ్లి తేదీ, ముహూర్తం, వేదిక వివరాలన్నీ మందుల బిళ్లల వెనుక ఉండే సమాచారం లాగే ప్రింట్ చేయించారు.ఫిబ్రవరి 4న జరగనున్న ఈ వెరైటీ వివాహ పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “వృత్తి పట్ల ఇంతటి అంకితభావమా!” అంటూ నెటిజన్లు ఈ జంటను ప్రశంసిస్తున్నారు. నవీన్ క్రియేటివిటీకి స్థానికులు కూడా ఫిదా అవుతున్నారు. మొత్తానికి ఈ ‘మెడికల్ వెడ్డింగ్ కార్డ్’ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
……………………………………………………..
