* కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను అప్ గ్రేడ్ చేయాలనాన్రు. సిలబస్ మార్పుకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని, అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని.. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని కోరారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా చర్యలు చేపట్టాలని.. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నీక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు.
………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
