Siricilla Rajaiah Meeting Thorrur
ఆకేరు న్యూస్,తొర్రుర్:
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ను తోరూర్ పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బుధవారం తొర్రుర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమండ్ల తిరుపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి తోరూర్ మార్కెట్ కమిటీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
* అనంతరం మాట్లాడుతూ
”సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సిరిసిల్ల రాజయ్య ను రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమించడం అభినందనీయం. వారి నాయకత్వంలో రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు . తోరూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి, స్థానిక రైతు సంక్షేమ కార్యక్రమాలకు వారి సహకారం, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు
ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు సంతోష్. మెరుగు మల్లేశం గౌడ్ మండల నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి చర్లపాలెం సర్పంచ్ ధర్మారకు మహేందర్. చిట్టి మల్ల మహేష్ బుర్ర కుమార్. తోరూర్ మార్కెట్ కమిటీకి చెందిన పలువురు పాలకమండలి సభ్యులు, ముఖ్య నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
