GRM College Meets Leaders
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ గోలి రామలింగయ్య మెమోరియల్ (జిఆర్ఎం) జూనియర్ కళాశాల అధ్యాపక బృందం వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని శుక్రవారం పేదపూర్వకంగా కలిశారు. కళాశాల ప్రిన్సిపల్ పెద్దపల్లి శారద ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన అధ్యాపక బృందం శాలువ, పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శారద కళాశాలకు సంబంధించిన అడ్మిషన్ వివరాలను గత సంవత్సరంలో సాధించిన ఫలితాలను వివరించారు. కళాశాల విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకం గూర్చి వారితో చర్చించారు. దూర ప్రాంతాల నుండి కళాశాలకు వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం ప్రభుత్వం ద్వారా మంజూరు చేపించాలి వారిని కోరారు. దీనికి శ్రీహరి సానుకూలంగా స్పందించారు. ఎంపీ, ఎమ్మెల్యేను కలిసిన వారిలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర బృందం ఉన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
